రియాద్ నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్‌కు క్రౌన్ ప్రిన్స్ నాయకత్వం.. లక్ష్యాలు వెల్లడి..!!

- September 28, 2024 , by Maagulf
రియాద్ నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్‌కు క్రౌన్ ప్రిన్స్ నాయకత్వం.. లక్ష్యాలు వెల్లడి..!!

రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్‌ను ప్రారంభించడంతోపాటు దాని డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రియాద్ సిటీ కోసం రాయల్ కమీషన్ డైరెక్టర్ల బోర్డు ఫౌండేషన్  డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులను జారీ చేశారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్.. రియాద్ సిటీ కోసం రాయల్ కమీషన్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, ఫౌండేషన్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. పరిశోధన, సామాజిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూనే సామాజిక కార్యక్రమాలకు అన్ని రూపాల్లో మద్దతు ఇవ్వడం, అభివృద్ధి చేయడం ఫౌండేషన్ లక్ష్యం.  లాభాపేక్ష లేని రంగంలో సామాజిక అభివృద్ధి  ఆవిష్కరణలను పెంపొందించే దిశగా ఈ ప్రయోగం ఒక మార్గదర్శక అడుగుగా భావిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారత కల్పించడం, సామాజిక ఐక్యతను పెంపొందించడం, రియాద్  గుర్తింపును పరిరక్షించడం ద్వారా సామాజిక అభివృద్ధిని సాధించడంపై ఫౌండేషన్ దృష్టి సారిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో ఫౌండేషన్ సామాజిక రంగంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలతో కలిసి పని చేస్తాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com