గల్ఫ్ కార్మికులకు తెలంగాణ శుభవార్త..ప్రవాసి ప్రజావాణి కౌంటర్‌ ప్రారంభం

- September 28, 2024 , by Maagulf
గల్ఫ్ కార్మికులకు తెలంగాణ శుభవార్త..ప్రవాసి ప్రజావాణి కౌంటర్‌ ప్రారంభం

హైదరాబాద్: గల్ఫ్ కార్మికులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి ( గల్ఫ్ కార్మికులు, ఎన్నారై ల కోసం) ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.ఈ కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అనంతరం మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు. 

సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో చెప్పినట్టు 4 అంశాల పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. అందులో మొదటిది తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్ళారు..వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల ఎక్ఫ్ గ్రెషీయ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసుకున్నామన్నానరు. 

గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నా నియోజకవర్గం లో జాబ్ మేళా పెడితే 9 వేల మంది వచ్చారు..విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలు తెలియడం లేదని తెలిపారు. వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించాలని... వాటిపై విస్తృత సమాచారం అందించాలన్నారు. సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని పొన్నం పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com