దుబాయ్ మిరాకిల్ గార్డెన్.. ఎంట్రీ ఫీజు తగ్గింపు..!!

- September 28, 2024 , by Maagulf
దుబాయ్ మిరాకిల్ గార్డెన్.. ఎంట్రీ ఫీజు తగ్గింపు..!!

దుబాయ్: దుబాయ్ మిరాకిల్ గార్డెన్ (DMG).. అందరికి ఇష్టమైన ఫ్యామిలీ థీమ్ పార్క్ సెప్టెంబర్ 28 నుండి ప్రారంభం అవ్వనుంది.  ఇపుడు నివాసితులకు ఎంట్రీ ఫీజు తగ్గించారు. ఎమిరేట్స్ IDని చూపడం ద్వారా పెద్దలు, పిల్లలు ఒక్కొక్కటి Dh60కి ఫ్లోరల్ పార్క్‌లోకి ప్రవేశించవచ్చు. గత సంవత్సరం ధర Dh65 ఉండగా, తాజాగా Dh5 తగ్గించారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉచితంగా ప్రవేశించవచ్చు.  

అయితే, పర్యాటకులు, యూఏఈ యేతర నివాసితుల కోసం టిక్కెట్ ధరలు 5 Dhలు పెరిగాయి. ఇప్పుడు పెద్దలకు Dh100, పిల్లలకు Dh85 గా నిర్ణయించారు.  సెప్టెంబర్ 28 నుంచి ఆన్‌లైన్ బుకింగ్‌ను స్వీకరించడం ప్రారంభిస్తామని డీఎంజీ ప్రకటించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సహజ పూల తోటగా పేర్కొనబడిన DMG ప్రతి సంవత్సరం దాదాపు 120 రకాల 150 మిలియన్లకు పైగా సహజ పుష్పాలను ప్రదర్శిస్తుంది. గార్డెన్ విభిన్న థీమ్‌లను కలిగి ఉంది.  దుబాయ్‌ల్యాండ్‌లో ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ మొదటిసారి ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14, 2013న ప్రారంభించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.వారాంతాల్లో (శనివారం, ఆదివారం) ప్రభుత్వ సెలవు దినాల్లో ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com