బహ్రెయిన్ లో దూసుకుపోతున్న లగ్జరీ కార్ మార్కెట్.. E- ట్రెండ్స్ ఫుల్ డిమాండ్..!!

- September 28, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో దూసుకుపోతున్న లగ్జరీ కార్ మార్కెట్.. E- ట్రెండ్స్ ఫుల్ డిమాండ్..!!

మనామా: బహ్రెయిన్ వినియోగదారులు విలాసవంతమైన కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది మార్కెట్ ఆదాయం $43 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వైపు చెప్పుకోదగ్గ మార్పుతో పాటు హై-ఎండ్ SUVలకు డిమాండ్‌ కారణంగా సాధ్యమైందని చెబుతున్నారు. బహ్రెయిన్ యొక్క లగ్జరీ కార్ మార్కెట్ ఈ సంవత్సరం $43 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించగలదని స్టాటిస్టా నుండి ఇటీవలి నివేదిక అంచనా వేసింది.  2028 వరకు 12.19% వార్షిక వృద్ధి రేటుతో $67 మిలియన్ల మార్కెట్ చేరుతుందని అంచనా వేస్తున్నారు.  2024లో అమ్మకాలు 600 యూనిట్లకు చేరుకోవచ్చని తెలిపారు. దీని సగటు ధర $105,000కి చేరుకుంటుందని చెబుతున్నారు. గత సంవత్సరంలో బహ్రెయిన్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలలో స్థిరమైన పెరుగుదలను రిపోర్ట్ వెల్లడించింది.  ప్రపంచ స్థాయిలో అమెరికా విలాసవంతమైన కార్ల ఆదాయాల్లో టాప్ పొజిషన్ లో ఉంది.  2024లో $6,654 మిలియన్ల ఆదాయాన్ని అంచనా వేస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com