పొంచువున్న ఎడారీకరణ ముప్పు..తక్షణ చర్యలకు సౌదీ అరేబియా పిలుపు..!!

- September 28, 2024 , by Maagulf
పొంచువున్న ఎడారీకరణ ముప్పు..తక్షణ చర్యలకు సౌదీ అరేబియా పిలుపు..!!

న్యూయార్క్:  ఈ డిసెంబరులో రియాద్‌లో జరగనున్న 16వ యూఎన్ కన్వెన్షన్ టు కంబాట్ ఎడారీకరణ (COP16)కి ముందు కరువు, ఎడారీకరణ ముప్పునకు ప్రాధాన్యత ఇవ్వాలని సౌదీ అరేబియా ప్రపంచ విధాన రూపకర్తలను కోరింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా "రోడ్ టు రియాద్" కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మాట్లాడుతూ.. నిర్ణయాత్మక అంతర్జాతీయ చర్య అవసరాన్ని తెలియజేశారు. రాబోయే COP కోసం రోడ్‌మ్యాప్‌ను వివరించారు. COP16 ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్న అబ్దుల్‌రహ్మాన్ అల్ఫాడ్లీ.. ఈ క్షణాన్ని "మన గ్రహానికి కీలకం" అని అభివర్ణించారు. సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారించడానికి భూమి పునరుద్ధరణ ప్రాముఖ్యతను వివరించారు. భూమి క్షీణతను అరికట్టడంలో ప్రపంచ సమాజం ఏకం కావాలని అల్ఫాడ్లీ పిలుపునిచ్చారు. సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ మరియు G20 గ్లోబల్ ల్యాండ్ ఇనిషియేటివ్ వంటి కీలక కార్యక్రమాలను ఉటంకిస్తూ పర్యావరణ పరిరక్షణలో సౌదీ అరేబియా నాయకత్వాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. UNCCD డేటా హెచ్చరించిన ప్రకారం.. భూమి క్షీణతను అడ్డుకునే లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి 1.5 బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాల్సి ఉంటుందన్నారు. రియాద్‌లో జరిగే COP16 సమావేశం ప్రపంచ పునరుద్ధరణ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి కాంక్రీట్ కట్టుబాట్లను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.  ప్రపంచంలోని దాదాపు 40% భూమి ఇప్పటికే క్షీణించిందని, 2000 నుండి కరువుల తీవ్రత 29% పెరిగిందని,  సౌదీ అరేబియా ఈ పర్యావరణ సంక్షోభాలను ఎదుర్కోవడానికి, జనాభాను రక్షించడానికి మెరుగైన చర్యల కోసం పిలుపునిస్తోందని వారు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com