తమిళనాడులోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
- September 30, 2024
చెన్నై: దేశంలో బాంబు బెదిరింపులు సర్వసాధారణమైపోయాయి. ఇటీవలే కాలంలో పాఠశాలలు, విమానాశ్రయాలు, హోటల్స్‌కు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
మదురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్, వేలఅమ్మాల్ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆయా విద్యాసంస్థలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన విద్యాసంస్థల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాంబు బెదిరింపుల వార్తతో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









