పిఠాపురంలో జనసేన వర్సెస్‌ టీడీపీ..!

- September 30, 2024 , by Maagulf
పిఠాపురంలో జనసేన వర్సెస్‌ టీడీపీ..!

అమరావతి: గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. భారీ విజయాన్ని అందుకున్నారు.. ఇక, జనసేన ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తుండగా.. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అయితే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీకి దూరంగా ఉండగా.. ఇప్పుడు టీడీపీ-జనసేన మధ్యే ప్రధాన పోటీ జరుగుతుండడం.. ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీకి దిగుతున్నారు టీడీపీ, జనసేన పార్టీలు.. ఐదుగురు డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, ఈ ఎన్నికల్లో ఎవరికి వారు అభ్యర్థులను నిలబెట్టారు.. జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ.. తమ అభ్యర్థుల పోటీకి దింపుతున్నారు.. ఐదు డైరెక్టర్ పోస్టులకు బరిలో ఉన్నారు 12 మంది అభ్యర్థులు కలిసి ఏకగ్రీవం చేసుకోవాల్సిన డైరెక్టర్ పదవులకి పోటీపడుతున్నాయి జనసేన, టీడీపీ.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ డైరెక్టర్ పదవులను ఏకగ్రీవంగా గెలుచుకుంటుంది.. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక 18 మంది నామినేషన్ వేస్తే ఆరుగురు విత్ డ్రా చేసుకున్నారు.. ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు జరిగింది.. వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్నాయి.. దీంతో.. జనసేన-టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? లేక వైసీపీ తప్పుకున్పటికీ.. జనసేన-టీడీపీ మధ్య పోటీ తప్పదా? అనే చర్చ సాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com