కథ సుఖాంతం..మూడేళ్ల తర్వాత కుటుంబంతో కలిసి స్వదేశానికి ప్రవాసుడు..!!
- October 02, 2024
యూఏఈ: యూఏఈలో మూడేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి కథ సుఖాంతం అయింది. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతూ యూఏఈకి వచ్చిన కుటుంబంతో కలిసి స్వదేశానికి బయలుదేరాడు. నిర్మాణ రంగ కార్మికుడు సంజయ్ మోతీలాల్ పర్మార్( 53) అక్టోబర్ 2న తన భార్య కోమల్ , కుమారుడు ఆయుష్‌తో కలిసి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లనున్నారు. వారు క్షమాభిక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఎగ్జిట్ పాస్ పొందారు. "ఇది జీవితంలో రెండవ అవకాశంగా అనిపిస్తుంది. ఇది ఒక కలగా అనిపిస్తుంది. " అని సంజయ్ అన్నారు.
తన భర్తను వెతుక్కుంటూ కోమల్ , ఆయుష్ సెప్టెంబర్ 8న యూఏఈకి వచ్చారు. సెప్టెంబర్ 19న సంజయ్ చిరునామాను గుర్తించారు. అబుదాబికి చెందిన పాకిస్తానీ ఎటిసలాట్ సాంకేతిక నిపుణుడు అలీ హస్నైన్ వద్ద ఆశ్రయం పొందుతున్న సంజయ్ ని కుటుంబసభ్యులు కలుసుకున్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







