ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు..5 నెలలగా తిండే లేదట !
- October 02, 2024
ఇరాక్: ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు...తాజాగా తెర పైకి వచ్చాయి.నాలుగు, ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదట యజమాన్యం.దీంతో పని మానేశారు ముగ్గురు కార్మికులు. దీంతో భోజనం పెట్టవద్దని కంపెనీ యజమాని మెస్ కు హుకుం జారీ చేశారు. ఈ తరుణంలోనే... తిండి లేక రూమ్ లోనే ఉంటున్నారు ముగ్గురు కార్మికులు. అయితే.. వీరి కష్టాల నేపథ్యంలోనే.. హైదరాబాద్ లో సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.
ఈ ఫిర్యాదు అందగానే... ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో ఆ యజమానిని పిలిపించింది భారత రాయబార కార్యాలయం.అయితే... ఎంబసీకి ఫిర్యాదు చేశారని ముగ్గురు తెలంగాణ కార్మిలకుల పై యజమాని దాడి చేశాడట. అటు 20 రోజుల క్రితం ఈ ముగ్గురు పై దాడి చేసి బలవంతంగా పనిలోకి పంపాడు యజమాని. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరన్నపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన హరీష్, నిజామాబాద్ జిల్లా కి చెందిన రాజన్న లు ఐదు నెలలుగా ఇరాక్ లో తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ కు చెందిన ఓ ఏజెంట్ కు ఒక్కొక్కరు 2,50,000 చెల్లించారట. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిథి)
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







