మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తికి జైలుశిక్ష, Dh100,000 జరిమానా..!!
- October 04, 2024
దుబాయ్: మాదకద్రవ్యాలు తీసుకొని డ్రైవింగ్ చేసి, తీవ్ర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన దుబాయ్ వాహనదారుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, Dh100,000 జరిమానాను విధిస్తూ దుబాయ్ ట్రాఫిక్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సైకోట్రోపిక్ పదార్థాలను సేవించడం, మద్యం సేవించి వాహనం నడపడం, గడువు ముగిసిన లైసెన్స్‌తో పబ్లిక్ రోడ్డుపై బీమా లేని వాహనాన్ని నడపడం వంటి నేరాలకు నిందితుడిని దోషీగా నిర్ధారించారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అతని జైలు శిక్ష పూర్తయిన తర్వాత, డ్రైవర్ దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత రెండేళ్ల పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అనుమతి లేకుండా వ్యక్తిగతంగా లేదా మరొకరి ద్వారా ఇతరులకు డబ్బు బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయడంపై అధికారులు నిషేధం విధించారు. వాహన డ్రైవర్లందరూ మాదకద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేయకుండా మరియు ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ అధిపతి, కౌన్సెలర్ సలాహ్ బు ఫరూషా అల్ ఫలాసి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







