రొమ్ము క్యాన్సర్‌ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!

- October 06, 2024 , by Maagulf
రొమ్ము క్యాన్సర్‌ పై అవగాహన కల్పిస్తున్న పింక్ సైక్లిస్టులు..!!

యూఏఈ: రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, స్క్రీనింగ్ చేయడం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి 'పింక్ టూర్' రెండవ ఎడిషన్  ఈ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో 150 కంటే ఎక్కువ సైక్లిస్టులు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన, ముందస్తుగా గుర్తించడంపై ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ (FOCP) అవగాహన కల్పిస్తుంది. పింక్ కారవాన్ కోసం దుబాయ్ ఆధారిత గ్రాస్‌రూట్ సైక్లింగ్ కలెక్టివ్ లాస్ హబీబిస్ ద్వారా 2023లో బైక్ టూర్‌ను ఒక-రోజు ఈవెంట్‌గా ప్రారంభించారు. ఈ సంవత్సరం మూడు రోజుల  ఈవెంట్‌గా నిర్వహించనున్నారు. అక్టోబర్ 13, 19, 26 తేదీల్లో  పింక్ సైక్లిస్టులు షార్జా, రస్ అల్ ఖైమా, ఫుజైరా, దుబాయ్ లలో పర్యటించనున్నారు. లాస్ హబీబిస్ వ్యవస్థాపకుడు రాబర్ట్ రెస్టో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పింక్ టూర్‌ లో ఎక్కువ మంది సైక్లిస్ట్‌లు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు అని తెలిపారు. గత సంవత్సరం 60 సైక్లిస్ట్‌లతో ప్రారంభించామని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ ప్రకారం..రోగ నిర్ధారణ చేయబడిన మొత్తం క్యాన్సర్లలో ఇది 21 శాతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com