టీమిండియా ఆల్‌రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- October 07, 2024
గ్వాలియర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. తొలుత బంతితో… ఆ తరువాత బ్యాట్ తో రఫ్పాడించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇక, స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా చెలరేగిపోయింది. ఓపెనర్ సంజు శాంసన్ (29), అభిషేక్ శర్మ (16), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29) ధనాధన్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. నితీశ్ కుమార్ రెడ్డి (16 నాటౌట్) రాణించగా.. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) బెంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







