120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!

- October 07, 2024 , by Maagulf
120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!

రియాద్: 2024 మూడవ త్రైమాసికం చివరి నాటికి మొత్తం 129,634,467 తీవ్రవాద కంటెంట్‌లు, వివిధ ప్లాట్‌ఫారమ్‌లోని 14,516 తీవ్రవాద ఛానెల్‌లను తొలగించారు. ఈ మేరకు  గ్లోబల్ సెంటర్ ఫర్ కంబాటింగ్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఐడియాలజీ (ఎటిడాల్), టెలీగ్రామ్ వెల్లడించాయి. తొలగించిన వాటిల్లో ISIS, హయత్ తహ్రీర్ అల్-షామ్, అల్-ఖైదా వంటి తీవ్రవాద అనుబంధ సంస్థలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ప్లాట్‌ఫారమ్‌లో అరబిక్‌లో ప్రచురించబడిన ఉగ్రవాద ప్రచారాన్ని పర్యవేక్షించడం, తొలగించడం ద్వారా ఉగ్రవాదం హింసాత్మక తీవ్రవాదాన్ని నిరోధించడం ఎదుర్కోవడం తమ లక్ష్యమని టెలికం సంస్థలు పేర్కొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com