యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- October 07, 2024
యూఏఈ: అమెరికా వీసాల కోసం యూఏఈలో డిమాండ్ పెరుగుతోంది. నివాసితులు సుదీర్ఘ అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం కొన్ని దేశాల నుండి వచ్చిన దరఖాస్తుదారులు తొమ్మిది నుండి 12 నెలల సమయం పడుతుందని వీసా సర్వీసెస్ వాణిజ్య డైరెక్టర్ అనస్తాసియా యాంచెంకో తెలిపారు. ఈ సుదీర్ఘ నిరీక్షణ సమయాలకు అనేక కారణాలు ఉన్నాయి. యూఏఈ పాస్‌పోర్ట్ హోల్డర్లు తక్కు అపాయింట్మెంట్ సమయాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు. రాయబార కార్యాలయాలు లేని వారితో సహా వివిధ దేశాల వ్యక్తులు లేదా వారి స్వదేశాలలో వీసా తిరస్కరణలను ఎదుర్కొన్న వారు కూడా యూఏఈ నుండి దరఖాస్తు చేసుకుంటారని, అప్లికేషన్ల సంఖ్య, ప్రాసెసింగ్ సమయం పెరిగేందుకు ఇది ఒక కారణం అని అన్నారు. చాలా మంది ప్రయాణికులు తమ దుబాయ్ పర్యటనలను వీసా దరఖాస్తు చేసేందుకు ఎంచుకుంటారని అనస్తాసియా వివరించారు. ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ అందించడం ద్వారా వీసా తిరస్కణ అవకాశాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. కాన్సుల్‌తో అబద్ధం చెప్పవద్దని, ఆస్తులు, బ్యాంకింగ్ చరిత్ర ద్వారా బలమైన ఆర్థిక సంబంధాలను ప్రదర్శించాలని సూచించారు.
యూఏఈ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం ఫాస్ట్-ట్రాక్ ఎంట్రీ
యూఏఈ, అమెరికా మధ్య ఇటీవలి ఒప్పందం యూఏఈ పాస్‌పోర్ట్ హోల్డర్లు రాష్ట్రాలకు ప్రయాణించడాన్ని సులభతరం చేసింది. ఇకపై సాధారణ క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. వేగవంతమైన ఎంట్రీని పొందవచ్చు. చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసాలు కలిగిన యూఏఈ పాస్‌పోర్ట్ హోల్డర్లు గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 10 నుండి 30 నిమిషాల పాటు సాగే ఈ ఇంటర్వ్యూలో ప్రయాణికులు ID పత్రాలను సమర్పించి, యూఎస్ సందర్శించడానికి గల కారణాలను వివరించాలి.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







