యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- October 07, 2024
యూఏఈ: యూఏఈలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఫుజైరాలోని ముర్బాద్, మైదక్ ప్రాంతాలలో వడగళ్ళ వర్సాలు కురిసాయి. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM), తుఫాను కేంద్రం పలు వీడియోలను విడుదల చేసాయి. రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అబుదాబి, దుబాయ్‌లలో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. తూర్పు, ఉత్తర ప్రాంతాల నివాసితులు లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని NCM సూచించింది. అత్యవసరమైతే తప్ప డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ నివాసితులను కోరింది. షార్జా పోలీసులు సోషల్ మీడియా పోస్ట్‌లో వర్షపు వాతావరణంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని వాహనదారులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







