వరుణ్ తేజ్ ఈ సారి అలా ఇలా కాదు.!
- October 07, 2024
మెగా రాకుమారుడు వరుణ్ తేజ్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో అంచనాలు క్రియేట్ చేశాడు. కానీ, చెల్లలేదు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు వరుణ్ తేజ్.
కానీ, ఇప్పుడు ఆ లోటు తీర్చేయబోతున్నాడట తన లేటెస్ట్ మూవీ ‘మట్కా’తో. ఇదో మాస్ జాతరలా వుండబోతోందనీ అంటున్నారు.
కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక, ట్రైలర్ నెక్స్‌ట్ లెవల్ వుండబోతోందనీ అంటున్నారు. అంతేకాదు, సినిమా అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చిందంటున్నారు.
ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ అవుతుందట. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. డిఫరెంట్ గెటప్స్‌లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడట ఈ సినిమాలో. రెట్రో మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వరుణ్ తేజ్‌లోని నటుడ్ని మరో కోణంలో ప్రెజెంట్ చేయనుందనీ అంటున్నారు. చూడాలిక.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









