ముద్రగడ తన నివాసంలో దీక్ష విరమణ ..
- June 21, 2016
కాపు రిజర్వేషన్ ఉద్యమ ఐక్యవేదిక నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించేందుకు అంగీకరించారని రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్యం అందిస్తున్న వైద్యులు తెలిపారు. అయితే ఆయన కిర్లంపూడిలోని తన నివాసంలో దీక్షను విరమించాలని భావిస్తున్నారని వారు తెలిపారు. అదే సమయంలో ముద్రగడ సతీమణి ఆసుపత్రిలో దీక్ష విరమిస్తారని వారు వెల్లడించారు. కాగా, దీనిపై ముద్రగడ లేదా జేఏసీ తరపునుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. 14 రోజులుగా దీక్ష చేపడుతున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. ముద్రగడకు ఏదైనా జరిగితే తీవ్రపరిణామాలుంటాయని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు.ముద్రగడ డిమాండ్ ప్రకారం తుని ఘటనలో అరెస్ట్ చేసిన 13 మందికి బెయిల్ రావడంతో ఆయన దీక్ష విరమిస్తారని అంటున్నారు.అయితే వారంతా జైలు నుంచి విడుదలైన తర్వాతే దీక్ష విరమిస్తానని ముద్రగడ సోమవారం స్పష్టం చేశారు. 13 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై కాపు నేతలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముద్రగడ ఆరోగ్యం విషయంలో టీడీపీ సర్కారు మొదటి నుంచీ పూర్తిగా నిర్లక్ష్యం పదర్శిస్తోందని కాపులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ వచ్చిన వారి విడుదలకు కూడా సహకరించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







