రాజకీయ పార్టీలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చేదే అలయ్ బలయ్
- October 07, 2024
హైదరాబాద్: రాజకీయ పార్టీలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావడమే అలయ్ బలయ్ లక్ష్యమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దత్తాత్రేయ నేతృత్వంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ప్రతియేటా దసరా సందర్భంగా తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు. ఈ ఏడాదితో అలయ్ బలయ్‌కు 19 ఏళ్లు పూర్తయిందన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో విడివిడిగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి, ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళే ఉద్దేశంతో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
పరస్పర విబేధాలు లేకుండా అందరూ కలుసుకునే ఆత్మీయ సమ్మేళనమే అలయ్ బలయ్ అన్నారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఆహారపు అలవాట్లను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అన్ని పార్టీల ప్రముఖ లీడర్లకు ఆహ్వానాలు పంపామని, ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు- చేశామని వెల్లడించారు. అందరినీ కలుపుకొని పోవడమే అలయ్ బలయ్ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!