ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్.. దుబాయ్‌లో తొలి విదేశీ క్యాంపస్ ప్రారంభం..!!
- October 08, 2024
యూఏఈ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) మొదటి ఓవర్సీస్ క్యాంపస్ వచ్చే ఏడాది ప్రారంభంలో దుబాయ్‌లో ప్రారంభించబడుతుందని భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్యాంపస్ దుబాయ్‌లోని ఎక్స్పో సిటీలోని ఇండియా పెవిలియన్ నుండి పని చేస్తుందని, స్వల్ప మరియు మధ్యకాలిక శిక్షణా కార్యక్రమాలతో పాటు పరిశోధన అవకాశాలను అందించడం ద్వారా దాని కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు. ఇంటర్నేషనల్ బిజినెస్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. IIFT కొత్త దుబాయ్ క్యాంపస్ యూఏఈ నుండి మాత్రమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో శిక్షణ, పరిశోధన అవకాశాలను కోరుకునే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి విద్యార్థులు, నిపుణులను ఆకర్షిస్తుందని భారతదేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఆకాంక్షించారు. ఈ సంస్థ 1963లో భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ క్రింద ఒక స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించారు. డీమ్డ్ యూనివర్సిటీ హోదాను IIFT కలిగి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







