చంద్రబాబు మార్క్..దేవాదాయ, మున్సిపల్ శాఖలో పోస్టుల భర్తీకి నిర్ణయం !
- October 09, 2024
అమరావతి: రేపు ఏపీ కేబినేట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుంది. వివిధ కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం... వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై కెబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం....13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ విషయమై కెబినెట్ ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం.
పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని యోచిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై చర్చించనున్న కెబినెట్....సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై నిర్ణయం తీసుకోనుంది.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- తొలి మిడ్ ఈస్ట్ సిటీగా చరిత్ర సృష్టించిన రియాద్..!!
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత







