అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలు..2 బిలియన్ దిర్హామ్‌ల ఆస్తులు సీజ్..!!
- October 10, 2024
యూఏఈ: మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడానికి యూఏఈ అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలపై నిఘాను పెంచింది. 2023లో 2 బిలియన్ దిర్హామ్‌ల కంటే ఎక్కువ విలువైన నిధులు, ఆస్తుల జప్తు చేసినట్టు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మొహమ్మద్ బాలమా తెలిపారు. అబుదాబిలో జరిగిన ఆర్థిక నేరాల జాతీయ సమ్మిట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఏఈ తన ఆర్థిక రంగం సమర్థత, సమగ్రతను కాపాడుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. యూఏఈ రెగ్యులేటరీ అధికారులు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారని, 2022లో Dh80 మిలియన్లతో పోలిస్తే, 250 మిలియన్ల కంటే ఎక్కువ ఆర్థిక ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. ఫైనాన్షియల్ సెక్టార్‌లోని లావాదేవీల పర్యవేక్షణ 2023లో మూడు రెట్లు పెరిగిందని గవర్నర్ తెలిపారు. గత సంవత్సరం మొత్తం దాదాపు 15,000 నియంత్రిత సంస్థలు, కంపెనీలలో 4వేల తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇటీవల, యూఏఈ 2024-2027 సంవత్సరాలకు మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడానికి జాతీయ వ్యూహాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!







