15 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. డ్యూటీ ఫ్రీ డ్రాలో $1 మిలియన్ గెలుచుకున్న ప్రవాసుడు..!!
- October 10, 2024
దుబాయ్: అల్ ఐన్‌లో నివసిస్తున్న ఒక సిరియన్ ప్రవాసుడు కొత్త మిలియనీర్ గా అవతరించాడు. తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రాలో అలీ అక్రమ్ అరబో $1 మిలియన్ విజేతగా నిలిచాడు. 67 ఏళ్ల అతను సెప్టెంబరు 30న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 3893తో ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. అల్ ఐన్‌లో 35 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్న అరబీ.. ఇప్పుడు 15 సంవత్సరాలకు పైగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్‌గా ఉన్నారు.అల్ ఐన్‌లోని ఒక ప్రైవేట్ కాంట్రాక్టు కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు పిల్లల తండ్రి అయిన అరబీ.. చాలా సంవత్సరాల తర్వాత విజేతగా నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు తెలిపాడు.
మిలీనియం మిలియనీర్ డ్రా తర్వాత.. రెండు లగ్జరీ కార్లు, మోటార్‌బైక్‌ల కోసం ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ డ్రా నిర్వహించారు. మన హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ లఖోటియా(50) సెప్టెంబరు 26న దుబాయ్ నుండి హైదరాబాద్‌కు వెళుతుండగా కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 1891లో టికెట్ నంబర్ 0826తో మెర్సిడెస్ బెంజ్ AMG GT 43 (అబ్సిడియన్ బ్లాక్ మెటాలిక్) కారును గెలుచుకున్నాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్ అయిన లఖోటియా ..ఇదో అద్భుతమని, తాను నమ్మలేకపోతున్నట్లు తెలిపారు.
షార్జాలో ఉన్న 55 ఏళ్ల భారతీయుడు జోతిభాసు మాధవన్.. అతను సెప్టెంబర్ 26న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 1893లో టికెట్ నంబర్ 1157తో మెర్సిడెస్ బెంజ్ S500 (అబ్సిడియన్ బ్లాక్ మెటాలిక్) కారును గెలుచుకున్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్ అయిన మాధవన్ ఇద్దరు పిల్లలకు తండ్రి. షార్జాలో తన స్వంత ప్రింటింగ్ ప్రెస్‌ని నడుపుతున్నారు. "నేను గెలిచానని నమ్మలేకపోతున్నాను. కానీ నేను గెలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను $1 మిలియన్ గెలుస్తానని ఆశిస్తున్నాను. ”అని అతను తెలిపారు.
దుబాయ్‌లో ఉన్న భారతీయ జాతీయుడైన షిహాబుదీన్.. ఆగస్టు 31న దుబాయ్ నుండి కోజికోడ్‌కు వెళుతున్నప్పుడు కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 596లో టికెట్ నంబర్ 0352తో BMW R 1250 RS (ట్రిపుల్ బ్లాక్) మోటార్‌బైక్‌ను గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడు అందుబాటులోకి రాలేదని నిర్వాహకులు తెలిపారు.
జోర్డాన్‌లోని జర్కాలో ఉన్న మరో భారతీయుడు సెప్టెంబర్ 25న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఫైనెస్ట్ సర్ప్రైజ్ సిరీస్ 598లో BMW S 1000 RR (రేసింగ్ రెడ్ మెటాలిక్ మోటార్‌బైక్‌ను టికెట్ నంబర్ 0836తో గెలుచుకున్నాడు. 55 ఏళ్ల సైదు మొహమ్మద్ గత ఆరు నెలలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో రెగ్యులర్ పార్టిసిపెంట్. ముగ్గురు పిల్లల తండ్రి అయిన అతను దులైల్‌లోని ఒక గార్మెంట్ తయారీ కంపెనీలో కమర్షియల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







