రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
- October 10, 2024
ముంబై: టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది వర్లి క్రమాటోరియం.కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంచారు. సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు రతన్ టాటాకు కడసారి నివాళులర్పించారు. సాయంత్రం 4 గంటలకు రతన్ టాటా భౌతిక కాయాన్ని ఎన్సీపీఏ నుంచి అంతిమ యాత్రగా వర్లి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొని రతన్ టాటాకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







