కియా కార్ల నూతన షోరూం ప్రారంభం..
- October 11, 2024
అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూంను నారా లోకేశ్ ప్రారంభించారు.రోజుకు 70కార్ల సర్వీస్ చేసేలా ఆధునిక వసతులతో షోరూం ఏర్పాటు చేశారు.ఈ షోరూం ప్రారంభ కార్యక్రమంలో కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీసీఎస్ ని ఒప్పించి ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేలా చేయటంతో సంతృప్తి చెందట్లేదని, ఇచ్చిన హామీ మేరకు 20లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని నారా లోకేశ్ అన్నారు. భారతదేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడ్ ఇన్ ఆంధ్రా కారు అని గర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు. పంటలు పండించలేని ప్రాంతంలో కార్లు పరిగెత్తించిన ఘనత చంద్రబాబుది.. కియా వల్ల ఒక్క అనంతపురం జిల్లాలోనే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని లోకేశ్ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







