టెస్లా నుంచి విడుదలైన డ్రైవర్ లెస్ రోబో టాక్సీ ఎలా ఉందో తెలుసా..?
- October 11, 2024
భవిష్యత్ యుగమంతా రోబోలదే అదే అని చెప్పిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల డ్రైవర్ లెస్ రోబో టాక్సీని విడుదల చేశారు, దీనికి ‘సైబర్ క్యాబ్’ అని నామకరణం అని కూడా చేశారు. ఈ వాహనం ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ఆటోమేటిక్, అంటే స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఏమీ ఉండవు. ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టంతో ఈ రోబో ని తయారు చేశారు.
ఈ వాహనాన్ని కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో నిర్వహించిన ‘వీరోబో’ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అయితే సైబర్ క్యాబ్ 2026 నుండి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ వాహనం ధర సుమారు 30,000 డాలర్లలోపు ఉంటుందని అంచనా. ఆటోమేటిక్ కార్లు సాధారణ కార్ల కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువగా వాడుకోవచ్చని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఈ వాహనం రైలు ఇంజిన్ వంటి డిజైన్‌తో తయారు చేయబడింది. చక్రాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు, ఇది భూమికి తక్కువ ఎత్తులో ఉంటుంది. రోబో టాక్సీ మోడల్ సాధారణ డిజైన్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది 20 మంది ప్రయాణికులను లేదా సరుకులను తరలించడానికి ఉపయోగపడుతుంది.
టెస్లా ఈ రోబో టాక్సీని 2019లో ప్రకటించినప్పటికీ, 2020 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావించారు. కానీ, నాణ్యతను మెరుగుపరచడం కోసం ఆలస్యమైందని మస్క్ తెలిపారు. చివరికి, 2024లో ఈ మోడల్‌ను ఆవిష్కరించారు.
ఈ రోబో టాక్సీ టెస్లా యొక్క సాంకేతికతను మరియు వినూత్నతను ప్రతిబింబిస్తుంది. ఇది భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఎలాన్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







