ఖతార్‌లో దంచికొట్టిన వాన..పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ..!!

- October 12, 2024 , by Maagulf
ఖతార్‌లో దంచికొట్టిన వాన..పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ..!!

దోహా: ఖతార్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దేశంలోని కొన్ని చోట్ల మేఘావృతమైన వాతావరణం నెలకొన్నది. బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడటంతో చాలా ప్రాంతాల్లో లో విజిబిలిటీతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఈ పరిస్థితి కొనసాగుతుందని ఖతార్ వాతావరణ విభాగం (QMD) ప్రకటించింది. వివిధ ప్రదేశాలలో కురిసిన వర్షానికి సంబంధించిన వీడియోలను నివాసితులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. రహదారులపై వినియోగదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని,  మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నివారించాలని సూచించారు.  ట్రాక్‌ల మధ్య నెమ్మదిగా కదలడం, వేగాన్ని తగ్గించడం, హెడ్‌లైట్‌లను ఆన్ చేయడం, ఇతర వాహనాల నుండి సురక్షితమైన దూరం పాటించడం, గాడ్జెట్‌ల వంటి పరధ్యానం నుండి దూరంగా ఉంచడం, మునిగిపోయిన రోడ్‌ల బదులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com