శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- October 14, 2024
తిరుమల: ఈ నెల 16న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.భారీ వర్ష హెచ్చరికతో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.రేపు(అక్టోబర్ 15) తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబోమమని అధికారులు తెలిపారు.భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల, తిరుపతిలోనూ రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బంది పడకుండా రేపటి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టం చేసింది. 16వ తేదీకి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సాధారణంగా.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. ఒకరోజు ముందుగానే సిఫార్సు లేఖలు స్వీకరిస్తారు. అంటే.. 16వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. 15వ తేదీన సిఫార్సు లేఖలను స్వీకరిస్తారు. అయితే, రేపు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ చెప్పింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది.
మరోవైపు..తిరుమల, తిరుపతిలో భారీ వర్షాల కారణంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అనేక జాగ్రత్తలు తీసుకుంది.ఇటు ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దించింది.ఎక్కడైతే కొండచరియలు విరిగిపడతాయో అక్కడ జాగ్రత్తలు తీసుకుని, ఎప్పటికప్పుడు వాటిని తొలగించేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సిందిగా..ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఈవో సూచించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







