ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు..
- June 22, 2016
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు. తుని కేసులో అరెస్టయిన నిందితులను విడుదల చేయాలనే డిమాండుతో ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత తన భార్యతో కలిసి కిర్లంపూడిలోని తన నివాసంలోనే దీక్ష ప్రారంభించినా.. పోలీసులు కలుగజేసుకుని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో అక్కడే తన దీక్షను కొనసాగించారు. ఓ వైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ముద్రగడ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 13 మందిని బెయిల్‌పై విడుదల చేయడంతో పాటు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించింది. అయినా ముద్రగడ దీక్షను విరమించకపోగా కొత్త షరతులు పెట్టారు. తాను దీక్ష విరమించాలంటే జైలు నుంచి విడుదలైన 13 మందిని, తనతో పాటు పోలీస్‌వ్యాన్‌లో కిర్లంపూడి తీసుకెళ్లాలని, కలెక్టర్, ఎస్పీలు కిర్లంపూడికి వచ్చి తనకు నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ కండీషన్లు పెట్టారు.
ముద్రగడ చేసిన డిమాండ్లన్నింటినీ నెరవేర్చామని, కొత్త షరతులకు ఒప్పుకొనేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపు జేఏసీ నేతలే ముద్రగడకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







