ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు..

- June 22, 2016 , by Maagulf
ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు..

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు. తుని కేసులో అరెస్టయిన నిందితులను విడుదల చేయాలనే డిమాండుతో ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత తన భార్యతో కలిసి కిర్లంపూడిలోని తన నివాసంలోనే దీక్ష ప్రారంభించినా.. పోలీసులు కలుగజేసుకుని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో అక్కడే తన దీక్షను కొనసాగించారు. ఓ వైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ముద్రగడ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 13 మందిని బెయిల్‌పై విడుదల చేయడంతో పాటు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించింది. అయినా ముద్రగడ దీక్షను విరమించకపోగా కొత్త షరతులు పెట్టారు. తాను దీక్ష విరమించాలంటే జైలు నుంచి విడుదలైన 13 మందిని, తనతో పాటు పోలీస్‌వ్యాన్‌లో కిర్లంపూడి తీసుకెళ్లాలని, కలెక్టర్‌, ఎస్పీలు కిర్లంపూడికి వచ్చి తనకు నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ కండీషన్లు పెట్టారు.
ముద్రగడ చేసిన డిమాండ్లన్నింటినీ నెరవేర్చామని, కొత్త షరతులకు ఒప్పుకొనేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపు జేఏసీ నేతలే ముద్రగడకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com