‘ఓజీ’ అప్‌డేట్.! మ్యాడ్ నెస్ క్రియేట్స్.!

- October 16, 2024 , by Maagulf
‘ఓజీ’ అప్‌డేట్.! మ్యాడ్ నెస్ క్రియేట్స్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా ఆల్రెడీ కొంత మేర షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోవడం వల్ల తాత్కాలికంగా సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది.

కానీ, ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వార్తల్లో నిలుస్తూనే వుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తూ వెంటాడుతూనే వుంది. ఇక, ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కూడా. లేటెస్ట్‌గా చిత్ర యూనిట్ నుంచి అప్డేట్ వచ్చింది. షూట్ బిగిన్స్ అంటూ. సినిమాటోగ్రఫర్ రవి.కె.చంద్రన్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

‘అన్ని సిలిండర్లు ఫైర్ చేసి, మ్యాడ్‌నెస్ సృష్టించేందుకు మేం మళ్లీ ‘ఓజీ’ ఫీవర్‌లోకి అడుగు పెట్టేశాం..’ అని ట్వీట్ చేశారాయన. అంతేకాదు, ఓ ఫోటో కూడా షేర్ చేశారాయన.

అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో వున్న కారణంగా ‘ఓజీ’ ఆయన లేకుండానే స్టార్ట్ అయ్యింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూట్‌లో జాయిన్ కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com