ఈనెల 23న ఏపీ కేబినెట్ భేటీ..
- October 18, 2024
అమరావతి: ఈనెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. ఇక, వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈనెల 21వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు పంపించాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు లేఖ రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్.. కాగా, 23వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు సాగే అవకాశం ఉంది.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.
సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కేబినెట్ సమావేశం చర్చించనుంది.. దేవాదాయ శాఖకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. ఇక, దీపావళి తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కాగా, ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయించగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా మృతి నేపథ్యంలో.. ఆయన మృతికి సంతాపం ప్రకటించింది ఏపీ మంత్రివర్గం.. ఇక, కేబినెట్ సమావేశానికి ముందుగానే రతన్ టాటా చిత్ర పటానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు.. అయితే, అజెండా అంశాలపై చర్చ వాయిదా వేసింది.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







