ఎఆర్ రెహమాన్. మరో మ్యాజికల్ ఆల్బమ్...
- June 22, 2016
ఇటీవల విడుదలైన 'సాహసం శ్వాసగా సాగిపో' పాటలతో సంగీత ప్రియులను మెప్పించారు ఎఆర్ రెహమాన్. అంతలోనే మరో మ్యాజికల్ ఆల్బమ్ అందించిందేకు సిద్ధమైపోయారీ స్వర మాంత్రికుడు. కార్తి హీరోగా మణిరత్నం ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. పైలట్ పాత్రలో కార్తి కనపడనున్న ఈ సినిమాలో అతడికి జతగా అదితి రావు హైదరీ నటించనుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకి రెహమాన్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సంగీత చర్చలు ఇటీవల మొదలయ్యాయి. ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు ఈ సినిమాకి గీత రచన చేయనున్నారు. ప్రస్తుతం 'కాష్మోరా' సినిమాతో బిజీగా ఉన్న కార్తీ అది పూర్తయిన వెంటనే మణితర్నం సినిమా కోసం లవర్ బాయ్‌గా మారనున్నాడు.
ఈ సినిమాని సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్‌లో మణిరత్నం నిర్మించనున్నారట. అన్నట్టు నటుడిగా తెరమీదికి రాకముందు కార్తి మణితర్నం వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!
- జపాన్ యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్‌కు భారీ ఎదురుదెబ్బ..
- హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్‌లో డేటా లీక్ కలకలం..కేసు నమోదు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్‌లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!







