కొనుగోలు ఇన్‌వాయిస్ తప్పనిసరిగా అరబిక్‌లో ఉండాలి..కువైట్
- October 22, 2024
కువైట్: ఇన్ వాయిస్ లు తప్పనిసరిగా అరబిక్ లాంగ్వేజీలోనే ఉండాలని కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొనుగోలు ఇన్‌వాయిస్ అనేది కంపెనీలు, షాపుల నుండి నిర్దిష్ట ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేసినట్లు రుజువు చేసే పత్రం అని గుర్తుచేసింది. కొనుగోలును నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే మీ హక్కులను కాపాడుకోవడం కోసం ఇన్ వాయిస్ ఉపయోగడుతుందని, భవిష్యత్తులో సమస్యలు తలెత్తినప్పుడు సాక్ష్యంగా ఉంటుందని తెలిపింది. అన్ని దుకాణాలు, కంపెనీలు, వాణిజ్య సంస్థలు అన్ని లావాదేవీల కోసం కొనుగోలు ఇన్‌వాయిస్‌లలో తప్పనిసరిగా అరబిక్‌ను ప్రాథమిక భాషగా ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వారు అరబిక్ భాషతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర భాషలను ఉపయోగించవచ్చని వెసులుబాటు కల్పించింది. ప్రతి ఇన్‌వాయిస్‌లో తప్పనిసరిగా సరఫరాదారు పేరు, తేదీ, చిరునామా, వస్తువు గురించిన వివరణ, షరతులు, పరిమాణం, ధర, డెలివరీ తేదీ, క్రమ సంఖ్య, సరఫరాదారు సంతకం, స్టాంప్‌ను కలిగి ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







