బహిష్కరణ వేటును తొలగించాలి.. ఓ ప్రవాస భారతీయుడు న్యాయ పోరాటం..!!

- October 22, 2024 , by Maagulf
బహిష్కరణ వేటును తొలగించాలి.. ఓ ప్రవాస భారతీయుడు న్యాయ పోరాటం..!!

యూఏఈ: సైబర్ క్రైమ్ , డిజిటల్ ట్రేడింగ్ కేసులో దోషిగా తేలిన తర్వాత తనపై ఫుజైరా ప్రైమరీ కోర్ట్ విధించిన బహిష్కరణ ఆర్డర్‌ను రద్దు చేయాలని ఓ భారతీయ ఉద్యోగి న్యాయ పోరాటం చేస్తున్నాడు. బాధితురాలి నుంచి దాదాపు 20,000 దిర్హామ్‌లను మోసగించి సేకరించినట్టు ఆయనపై కేసులు నమోదయ్యాయి. కాగా, ఆ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ, అతను ఫుజైరా అప్పీల్ కోర్టులో అప్పీల్ చేశాడు. జులైలో టెలిగ్రామ్ ద్వారా తనను సంప్రదించి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లోకి రావాలని, మెరుగైన లాభాలు తిరిగొస్తాయని నమ్మించి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

దర్యాప్తులో, అకౌంట్లలో ఒకటి 26 ఏళ్ల భారతీయ నిందితుడికి చెందినదని పోలీసులు గుర్తించారు. అతనిపై సైబర్ క్రైమ్, మోసం, దాదాపు 20,000 దిర్హామ్‌లు మోసగించడం వంటి అభియోగాలు మోపారు. అయితే, సదరు ఇన్‌స్టాగ్రామ్‌లో మోసానికి ఉపయోగించిన సంస్థలో తాను ఉద్యోగి అని, తనకు మోసం చేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో భాగంగా పనులను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తన యజమాని ఖాతాదారులను సంప్రదించి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసేలా వారిని ఒప్పించడం తన రోల్ అని అతను కోర్టుకు తెలిపాడు. ఖాతాదారులకు చెందిన నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని చెప్పారని, తనను వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారని, అక్కడ తన బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని సూచించారని, ఆ తర్వాత డబ్బును సేకరించేందుకు ఆ అకౌంట్ ను ఉపయోగించారని పేర్కొన్నాడు.  "తన ఉద్యోగంలో భాగంగా మాత్రమే డబ్బు అందుకున్నాడు. అతను ఆ డబ్బును తన యజమానులకు బదిలీ చేసాడు." అని ప్రవాస భారతీయుడి తరఫు లాయర్ హగాగ్ వాదించాడు. న్యాయవాది తన వాదనకు మద్దతుగా కోర్టుకు పత్రాలను సమర్పించాడు. తన క్లయింట్‌ను నిర్దోషిగా విడుదల చేయాలని న్యాయమూర్తులను అభ్యర్థించాడు. త్వరలో కోర్టు ముందు ఈ కేసుపై విచారణ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com