ఒత్తిడి, కాలుష్యం, పెద్ద శబ్దాలతో నష్టం.. సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం..!!

- October 22, 2024 , by Maagulf
ఒత్తిడి, కాలుష్యం, పెద్ద శబ్దాలతో నష్టం.. సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం..!!

యూఏఈ: ఒత్తిడి, వాయు కాలుష్యం, పెద్ద శబ్దాలు పర్యావరణ కారకాలని, అవి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయని యూఏఈలోని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  "పెద్ద శబ్దాలు, కాలుష్యం, ఒత్తిడి వంటివి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి." అని అబుదాబిలోని హెల్త్‌ప్లస్ ఐవిఎఫ్‌లో రిప్రొడక్టివ్ మెడిసిన్, ఇన్‌ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ నాడియా నజ్జారి అన్నారు. “ఉదాహరణకు, భారీ శబ్దాలతో నిద్రపోలేరు. అది పిట్యూటరీ గ్రంధిని ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. గుడ్లు ఉత్పత్తి కావు. అంటే స్త్రీలు గర్భవతి కావడం క్లిష్టంగా మారుతుంది. పురుగుమందుల వంటి రసాయనాలకు గురికావడం హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. మహిళల్లో గర్భస్రావాలకు కూడా కారణమవుతుంది." అని డాక్టర్ నాడియా తెలిపారు.  

డాక్టర్ నజ్జారి వ్యాఖ్యలను ఆస్టర్ రాయల్ క్లినిక్ డౌన్‌టౌన్ దుబాయ్‌లో స్పెషలిస్ట్ గైనకాలజీ,  ప్రసూతి వైద్యుడు డాక్టర్ శిఖా గార్గ్ సమర్థించారు. "పర్యావరణ కారకాలు ఆరోగ్యం, వ్యాధులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు పేర్కొన్నాయి. సంతానోత్పత్తి విషయంలోనూ అదే జరుగుతుంది" అని తెలిపారు. "స్థూలకాయం, తక్కువ బరువు, శారీరక శ్రమ, వ్యాయామాలు, రేడియేషన్, ధూమపానం, ఆల్కహాల్ వంటి అంశాలు, గంజాయి, అధిక మద్యపానం వంటి మాదకద్రవ్యాలను ఉపయోగించడం వంటివి సంతానోత్పత్తిపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి." అని వివరించారు. 2022లో యూఏఈ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. దేశంలోని ప్రతి ఆరుగురి జంటలలో ఒకరు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2021లో ప్రపంచ జనాభాపై యూఎన్ నివేదిక యూఏఈలో సంతానోత్పత్తి రేట్లు (మొత్తం సంఖ్య ప్రతి స్త్రీకి పిల్లలు) కేవలం 1.4 వద్ద ఉన్నది. ఇది 1990ల నుండి గణనీయమైన తగ్గుదల అని వైద్యనిపుణులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com