వాట్సప్ ద్వారానే పౌర సేవలు..మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం
- October 22, 2024
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 1 జన్పథ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా సంస్థ ప్రతినిధులు రవిగార్గ్, నటాషా, ఆర్టీజీఎస్ సీఈవో దినేశ్, ఐఏఎస్ అధికారి, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పౌర సేవలకు సంబంధించి మెటా-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో ఎంవోయూ చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ”విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశా. మొబైల్ ద్వారానే ఆయా సర్టిఫికెట్లు అందిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు వాట్సప్ ద్వారానే వివిధ రకాల సర్టిఫికెట్లు, పౌరసేవలు అందించేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్లైన్లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం” అని మంత్రి లోకేశ్ తెలిపారు.
మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను వినియోగించుకుని వాట్సప్ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ తెలిపారు. ప్రజలు తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వాట్సప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందన్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమ సేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







