BD1మిలియన్ ఫ్రాడ్.. కంపెనీ మేనేజర్ కు 5ఏళ్ల జైలుశిక్ష..!!

- October 23, 2024 , by Maagulf
BD1మిలియన్ ఫ్రాడ్.. కంపెనీ మేనేజర్ కు 5ఏళ్ల జైలుశిక్ష..!!

మనామా: BD1 మిలియన్ కంటే ఎక్కువ అక్రమ లావాదేవీలలో మోసానికి పాల్పడిన మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీ మేనేజర్‌కు ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు ఆఫ్ కాసేషన్ సమర్థించింది. బాబ్ అల్ బహ్రెయిన్ బ్రాంచ్‌లో పనిచేసిన మేనేజర్.. నకిలీ ఖాతాదారుల పేర్లను ఉపయోగించి అంతర్జాతీయ నగదు బదిలీలను ప్రాసెస్ చేయడానికి BD5,100 లంచం అందుకున్నాడు. అతనికి సహకరించిన ఇద్దరు సహచరులకు మూడేళ్ల జైలుశిక్షతోపాటు బహిష్కరణ వేటు వేయనున్నారు. 2021 -23 మధ్య కాలంలో మేనేజర్ లంచాలు స్వీకరించారని, అతని విధులను ఉల్లంఘించారని, కంపెనీ సిస్టమ్‌లో తప్పుడు డేటాను నమోదు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అతని సహచరులపై లంచం, కుట్ర అభియోగాలు మోపారు. ఒక సహచరుడు BD4,500 లంచం కోసం సుమారు BD1 మిలియన్ మొత్తం 587 లావాదేవీలను చేసాడని,  మరొకడు BD600 లంచం కోసం BD100,000 విలువైన 78 బదిలీలను ప్రాసెస్ చేశాడని గుర్తించారు. మోసపూరిత కార్యకలాపాలతో తాము పని చేస్తున్న సంస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించారని ఆరోపించారు. ప్రాథమిక కోర్టు తీర్పును హైకోర్టు గతంలో ధృవీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com