ఒమన్ లో సముద్ర క్షీరదాలపై సర్వే.. నాలుగో దశ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- October 23, 2024
ఖాసబ్: సముద్ర క్షీరదాల సర్వే ప్రాజెక్టు నాలుగో దశ ఖాసబ్ ముసందం గవర్నరేట్‌లోని విలాయత్‌లో ప్రారంభమైంది. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ఎన్విరాన్మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. అక్టోబర్ 31 వరకు సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ లో భాగంగా ముసందమ్లోని నేషనల్ నేచర్ పార్క్‌లో సముద్రపు క్షీరదాల సమగ్ర డేటాబేస్‌ను అభివృద్ధి చేయనున్నట్టు ఎన్విరాన్మెంట్ అథారిటీకి చెందిన ప్రాజెక్ట్ టీమ్ హెడ్ ఇంజనీర్ ఐదా బింట్ ఖలాఫ్ అల్ జబ్రియా తెలిపారు. ఆధునాతన టెక్నాలజీ సాయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు.. పగడ్బందీగా ఫోటోలు సహా వివరాలను నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక-నాణ్యత కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, గోప్రోలను ఉపయోగించి డేటాను రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. సముద్రపు క్షీరదాల ఉనికి, వాటి పునరుత్పత్తిని తెలుసుకునేందుకు పర్యావరణ అథారిటీ ఆసక్తిగా ఉందని ఆయన వివరించారు. ప్రాజెక్ట్ నిర్వహణకు మత్స్యకారుల నుండి విస్తృత సహాయాన్ని తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!