కింగ్డమ్ లో పార్కింగ్ సమస్యకు చెక్..ప్రణాళికకు ఎంపీలు ఏకగ్రీవ ఆమోదం..!!
- October 23, 2024
మనామా: బహ్రెయిన్ లో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. MP బాస్మా ముబారక్ ప్రతిపాదించిన ప్రణాళికను ప్రతినిధుల మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. దాంతో రద్దీగా ఉండే మా హుడ్స్‌లో నిరూపయోగ భూములలో మల్టీ స్టోర్ కార్ పార్క్‌లుగా మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్కింగ్ ప్రదేశాలు నిత్యం రద్దీగా ఉంటున్నాయని, దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎంపీ అన్నారు. ఇప్పటివరకు ఉపయోగించని స్థలాలను పార్కింగ్ అవసరాలకు ఉపయోగించుకోవాలని, దాంతో పార్కింగ్ సమస్య కొంత వరకు తీరుతుందని తెలిపారు. పెరుగుతున్న కార్ల సంఖ్యతోపాటు పార్కింగ్ ప్రదేశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పార్కింగ్ కేటాయింపులు స్థానిక కౌన్సిల్‌లకు సమస్యగా మారిందని పేర్కొన్నారు. ముబారక్ ప్రతిపాదనకు ఎంపీలు అబ్దుల్‌హకీమ్ అల్షానో, అలీ సాకర్, జమీల్ ముల్లా హసన్, అహ్మద్ అల్సలూమ్ మద్దతుగా నిలిచారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







