ప్రైవేట్, ఫ్యామిలీ హౌజింగ్ ఏరియాలో తగ్గిన బ్యాచిలర్ల సంఖ్య..!!

- October 23, 2024 , by Maagulf
ప్రైవేట్, ఫ్యామిలీ హౌజింగ్ ఏరియాలో తగ్గిన బ్యాచిలర్ల సంఖ్య..!!

కువైట్: కువైట్ లో అధికారుల తనిఖీలు ఫలితం ఇస్తున్నాయి. తనిఖీ బృందాల ఇంటెన్సివ్ ఫీల్డ్ క్యాంపెయిన్‌ల కారణంగా ఈ సంవత్సరం ప్రైవేట్, ఫ్యామిలీ హౌజింగ్ ఏరియాలో నివసించే బ్యాచిలర్ల శాతం గణనీయంగా తగ్గిందని కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ సౌద్ అల్-దుబౌస్ తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లను బ్యాచిలర్లకు ఇవ్వకుండా ఉండేలా క్రమం తప్పకుండా మునిసిపాలిటీ బృందాలు పర్యవేక్షిస్తాయని, తనిఖీలు చేపడుతున్నాయని వెల్లడించారు.  అదే సమయంలో ప్రాపర్టీ యజమానులు కూడా అధికారులకు సహకరిస్తున్నారనొ, బ్యాచిలర్‌లకు రెంట్ ఇవ్వకూడదన్న నిబంధనలను పాటిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com