ఆర్ట్ అభిమానులకు శుభవార్త..నవంబర్ 25 నుంచి ఖతార్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్..!!
- October 23, 2024
దోహా: ఖతార్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ 2024 6వ ఎడిషన్ నవంబర్ 25-30వ తేదీలలో జరగనుంది. MAPS ఇంటర్నేషనల్ WLL సహకారంతో కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ - కటారా దీనిని నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ లో 72 దేశాలకు చెందిన 350 మంది కళాకారులు పాల్గొంటున్నారు. వారు వివిధ రకాల కళాకృతులను ప్రదర్శించనున్నారు. ప్రధాన ఈవెంట్ తోపాటు 14 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శిల్ప ప్రదర్శన, ప్యానెల్ చర్చలు, ఆర్ట్ వర్క్షాప్లు, ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష పెయింటింగ్ ఈవెంట్తో పాటు సాంస్కృతిక పర్యటనలు, మ్యూజిక్ ఈవెనింగ్, ఫ్యాషన్ షోలు ఇందులో ఉన్నాయి. ఖతార్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ నవంబర్ 30న ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ కళాకారులను సత్కరించనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







