ఆర్ట్ అభిమానులకు శుభవార్త..నవంబర్ 25 నుంచి ఖతార్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్..!!

- October 23, 2024 , by Maagulf
ఆర్ట్ అభిమానులకు శుభవార్త..నవంబర్ 25 నుంచి ఖతార్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్..!!

దోహా: ఖతార్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ 2024 6వ ఎడిషన్ నవంబర్ 25-30వ తేదీలలో జరగనుంది. MAPS ఇంటర్నేషనల్ WLL సహకారంతో కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ - కటారా దీనిని నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ లో 72 దేశాలకు చెందిన 350 మంది కళాకారులు పాల్గొంటున్నారు. వారు వివిధ రకాల కళాకృతులను ప్రదర్శించనున్నారు. ప్రధాన ఈవెంట్ తోపాటు 14 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శిల్ప ప్రదర్శన, ప్యానెల్ చర్చలు, ఆర్ట్ వర్క్‌షాప్‌లు, ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష పెయింటింగ్ ఈవెంట్‌తో పాటు సాంస్కృతిక పర్యటనలు, మ్యూజిక్ ఈవెనింగ్, ఫ్యాషన్ షోలు ఇందులో ఉన్నాయి. ఖతార్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ నవంబర్ 30న ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ కళాకారులను సత్కరించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com