యూఏఈ వీసా అమ్నెస్టీ స్కీమ్..10వేల మందికి భారత కాన్సులేట్ సహాయం..!!
- October 23, 2024
దుబాయ్: యూఏఈ ప్రకటించిన క్షమాభిక్ష పథకం కోసం భారతీయ ఎంబసీలు అండగా నిలిచాయి. దాదాపు 10 వేలమంది భారతీయులకు సహాయం అందించినట్టు దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు అల్ అవీర్‌లో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రయోజనాలను పొందడంలో భారతీయ పౌరులకు సహాయం చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు వివిధ భారతీయ డయాస్పోరా సంస్థల సహకారంతో 10వేల కంటే ఎక్కువ మందికి సౌకర్యాలు కల్పించామని, అదే సమయంలో 1300 పాస్‌పోర్ట్‌లు, 1700 ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు, 1500 కంటే ఎక్కువ ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేశామని వెల్లడించింది. యూఏఈ అధికారుల నుండి రుసుము/పెనాల్టీ మినహాయింపులను పొందడంలో సహాయంగా నిలిచినట్టు తెలిపింది. దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లోని భారతీయ పౌరులు తమ రెసిడెన్సీని చట్టబద్ధం చేసుకోవడానికి లేదా దేశం విడిచిపెట్టడానికి వీసా అమ్నెస్టీ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కాన్సులేట్ కోరింది. యూఏఈకి వచ్చే భారతీయులు ఎంట్రీ, వర్క్, రెసిడెన్సీ కోసం స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన సరైన విధానాలను అనుసరించాలని కూడా కాన్సులేట్ సూచించింది.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







