గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కొత్త ఉప కులపతుల భేటి
- October 23, 2024
హైదరాబాద్: కొత్తగా నియమితులైన రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. ఉన్నత విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో విద్యారంగంలో తీసుకురావాల్సిన ఆవిష్కరణలు, సంస్కరణలపై సమావేశం చర్చించింది.ఈ సందర్భంగా ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారం గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకొచ్చేలా కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఇతర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు విద్యారంగ అభివృద్ధి, విద్యార్థులకు ఉత్తమ నైపుణ్యాలను అందించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఐ. పురుషోత్తం ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







