‘రాజాసాబ్’లో ఇంకో యాంగిల్ చూశారా.?
- October 24, 2024
మారుతి డైరెక్షన్లో ప్రబాస్ నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని తెలిసిందే.
ఇంతవరకూ ప్రబాస్‌కి సంబంధించి మూడు పోస్టర్లు రిలీజ్ చేశారు ఈ సినిమా నుంచి. అయితే, ప్రబాస్ పుట్టినరోజు సందర్భంగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఇంతవరకూ రొమాంటిక్ యంగ్ రెబల్ స్టార్‌ని మాత్రమే డిఫరెంట్ స్టిల్స్‌లో చూపించిన మేకర్లు, ఈ సారి ఓల్డ్ ఏజ్డ్ ప్రబాస్ స్టిల్‌ని చూపించారు.
సింహాల సింహాసనంపై రౌద్రంగా కూర్చొన్న ప్రబాస్. మెరిసిన జుట్టు, నోటిలో చుట్ట, కాళ్లకు, చేతులకు కడియాలు, ఉంగరాలు.. కాలు మీద కాలేసుకుని రాజసంగా కూర్చున్న స్టిల్ ఇది. ప్రబాస్ లుక్స్ అదిరిపోతున్నాయ్ ఈ స్టిల్‌లో.
ఇలా ఇప్పటికి నాలుగు స్టిల్స్ రిలీజ్ అయ్యాయ్ ‘రాజా సాబ్’ నుంచి చివరిగా వచ్చిన లుక్‌తో ప్రబాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడన్న సంగతి అర్ధమైంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ రిథి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
The KING…as usual on a RECORD BREAKING SPREE 😎🤙🏻https://t.co/S29PLlO7nh#Prabhas #TheRajaSaab pic.twitter.com/48XiwZcWFO
— The RajaSaab (@rajasaabmovie) October 24, 2024
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







