బిగ్ హౌస్‌లో టెర్రర్.! భయపెట్టేసిన గంగవ్వ.!
- October 24, 2024
బిగ్‌బాస్ హౌస్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్. అసలే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన బ్యాచ్ అంటూ రెండు భాగాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ డివైడ్ అయ్యింది ఈ సీజన్ బిగ్‌బాస్‌లో.
అందులో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు తమదైన సీనియారిటీతో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా అవినాష్, టేస్టీ తేజ మరియు గంగవ్వ కలిసి ఓ ప్రాంక్ చేశారు. గంగవ్వకు దయ్యం పట్టినట్లుగా యాక్ట్ చేయించి హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్లను భయపెట్టేశారు.
అర్ధరాత్రి అందరూ నిద్రపోయాకా ఈ ప్రాంక్‌ని అమలు చేశారు. వీక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పంచారు. తనదైన పంచ్ డైలాగులతో ఇంతవరకూ ఆకట్టుకున్న గంగవ్వ తనలోని మరో యాంగిల్‌ని బయట పెట్టింది ఈ ప్రాంక్ వీడియో ద్వారా.
నిజంగానే గంగవ్వకు దయ్యం పట్టిందా.? అన్నట్లుగా పర్‌ఫామెన్స్ ఇచ్చేసింది. రోహిణి అయితే, నిజంగానే చాలా భయపడిపోయింది. హౌస్ మొత్తం ఈ ఎపిసోడ్‌లో కాస్త భయానక వాతావరణం నెలకొనగా.. రిజల్ట్ ఇంత బాగా వచ్చేసరికి తెల్లారాకా అవినాష్, టేస్టీ తేజల ఆనందం అంతా ఇంతా కాదు.. మరి, ఈ పరిణామాన్ని బిగ్‌బాస్ స్వీకరిస్తాడా.? లేదంటే, ఏదైనా పనిష్‌మెంట్ ఇస్తాడా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







