సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
- October 24, 2024
న్యూ ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు.భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం పట్ల కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.
జస్టిస్ ఖన్నా నవంబర్ 11న భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఏడు నెలల పాటు ఉన్నత న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మే 13, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పని చేయనున్నారు. పదవీకాలం ముగిసిన CJI DY చంద్రచూడ్ ..జస్టిస్ ఖన్నా పేరును సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయడం జరిగింది.చంద్రచూడ్ తర్వాత అత్యంత సీనియన్ న్యాయమూర్తి కావడంతోనే సంజీవ్ ఖన్నాకు ఈ అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







