ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ పోటీ విజేతలను సత్కరించిన అల్ బతినా సౌత్ గవర్నర్

- October 24, 2024 , by Maagulf
ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ పోటీ విజేతలను సత్కరించిన అల్ బతినా సౌత్ గవర్నర్

అల్ రుస్తాక్: ఏడెస్ దోమలను నిర్మూలించే లక్ష్యంతో  నిర్వహించిన ఎన్విరాన్మెంటల్ సానిటైజేశన్ ప్రచార పోటీలో విజేతలను అల్ బతినా సౌత్ గవర్నర్ ఎంగ్ మసూద్ బిన్ సైద్ అల్ హష్మీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్ బతిన కౌన్సిల్ సభ్యులు, అల్ బతినా సౌత్ గవర్నరేట్ విలాయత్ల వలీలు, మజ్లిస్ అష్షూరా సభ్యులు, మునిసిపల్ కౌన్సిల్స్ సభ్యులు మరియు వివిధ ప్రభుత్వ మరియు పౌర సంస్థల అధికారులు పాల్గొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమం ద్వారా, ఇంటి పరిసరాల పరిశుభ్రతను ప్రోత్సహించడం మరియు ప్రజలలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది మరియు విజేతలకు ప్రశంసలు అందజేయడం జరిగింది. ఈ ప్రచారం కేవలం పోటీ మాత్రమే కాకుండా పర్యావరణ సంరక్షణ సంస్కృతిని నిర్మించే దిశగా అడుగులు వేసిందనీ అల్ బతిన గవర్నర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com