కువైట్, యూకే ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభం..!!

- October 25, 2024 , by Maagulf
కువైట్, యూకే ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభం..!!

కువైట్: మూడు వారాల పాటు సాగే యూకే -కువైట్ ఉమ్మడి సైనిక విన్యాసాన్ని (ఐరన్ షీల్డ్ 2) ప్రారంభమైంది. ఈ సందర్భంగా కువైట్ ఎక్సర్సైజ్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ అల్-జాబెర్ మాట్లాడుతూ.. సైనిక, భద్రతా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంచుతుందన్నారు. జాయింట్ ఎక్సర్‌సైజ్‌లో ఆపరేటింగ్ వెపన్స్, స్పెషలైజ్డ్ జాయింట్ స్నిపర్ ట్రైనింగ్, వివిధ మిలిటరీ వాహనాలను హ్యాండిల్ చేయడంతోపాటు తమ తమ ఆయుధ వ్యవస్థల్లో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకుంటామని కల్నల్ అల్-జాబర్ చెప్పారు. గ్రౌండ్ ఎలిమెంట్స్‌కు మద్దతుగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం, ముఖ్యంగా భవనాల లోపల, అలాగే శాంతి పరిరక్షణ, అంతర్గత భద్రతా కార్యకలాపాలను సులభతరం చేయడానికి బెటాలియన్ కమాండర్‌కు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ఉత్తమమైన పద్ధతులపై ఇరుపక్షాలు శిక్షణ ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కసరత్తులో ఆధునిక సాయుధ వాహనాలపై శిక్షణ, వాహనాలు, సిబ్బందికి తనిఖీ, ముందు జాగ్రత్త పద్ధతులు, బిల్డింగ్ క్లియరెన్స్, కౌంటర్ టెర్రరిజం, క్రౌడ్ కంట్రోల్‌తో పాటు కర్ఫ్యూల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయని తెలిపారు. బ్రిటీష్ వైపు సహకారం కొనసాగుతుందని, ప్రతి వ్యాయామం విభిన్న నైపుణ్యాలపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com