'సుడిగాలి' తుఫాను వీడియోలు వైరల్..ల్యాండ్‌స్పౌట్ ప్రమాదకరం కాదు.. NCM క్లారిటీ..!!

- October 25, 2024 , by Maagulf
\'సుడిగాలి\' తుఫాను వీడియోలు వైరల్..ల్యాండ్‌స్పౌట్ ప్రమాదకరం కాదు.. NCM క్లారిటీ..!!

యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఖేదీరా ప్రాంతంలో అక్టోబర్ 23న ఏర్పడిన ల్యాండ్‌స్పౌట్ .. సుడిగాలికి భిన్నమైనదని, ప్రమాదకరమైనది కాదని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) స్పష్టత ఇచ్చింది. కాగా, ల్యాండ్‌స్పౌట్ వీడియోలు,  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఎన్సీఎం స్పందించింది. అవన్నీ సుడిగాలిలా అనిపించవచ్చని,అయితే, అవి సుడిగాలికి భిన్నంగా ఉంటాయని తెలిపారు. "ల్యాండ్‌స్పౌట్ వాటర్‌స్పౌట్ మాదిరిగానే ఉంటుంది .రెండూ భూమి నుండి (లేదా నీరు) మేఘం వరకు ఏర్పడతాయి." అని యూఏఈ వాతావరణ బ్యూరో ప్రతినిధి వివరించారు. "రాడార్‌తో ల్యాండ్ స్పౌట్‌లు, వాటర్‌పౌట్‌లను గుర్తించడం చాలా కష్టం. తక్కువగా, పరిమాణంలో చిన్నగా.. తీవ్రతలో బలహీనంగా ఉంటాయి.” అని పేర్కొన్నారు. బుధవారం NCM షేర్ చేసిన వీడియోలలో కల్బా, రస్ అల్ ఖైమాలో సుడిగాలిలా కనిపించే భారీ ల్యాండ్ స్పౌట్‌లు కనిపించాయి. భారీ ధూళి ఆ ప్రదేశం అంతటా తిరుగుతూ కనిపించడం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు కనిపించాయని పలుగురు స్పందించారు. ఇదిలా ఉండగా, యూఏఈ లోని కొన్ని ప్రాంతాలలో బుధవారం భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com